క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ శరవేగంగా తెరకెక్కుతున్నాయి. కాగా ఈ చిత్రంలో లెంజెండరీ దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో క్రిష్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఈ సన్నివేశాల్లో కొన్నిటిని ఇప్పటికే షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు ఎన్టీఆర్ కి, కేవీ రెడ్డికి మధ్య అనుబంధానికి సంబంధించిన సీన్స్ అట.
ఐతే క్రిష్ ‘మహానటి’ చిత్రంలో కేవీ రెడ్డి పాత్రలో నటించి మెప్పించారు. మరి ఈ చిత్రంలో ఎలా నటించారో చూడాలి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో కేవీ రెడ్డిగారి చివరి రోజుల్లో ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను, అప్పటి పరిస్థితులను చూపించనున్నారు. ఎన్టీఆర్గారు కేవీ రెడ్డిగారికి చేసిన సాయాన్ని కూడా ఈ చిత్రంలో ప్రస్తావించనున్నారు.
కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు.


