క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 5నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్ర షూట్ ను పూర్తి చేయడానికి టైమ్ కూడా ఫిక్స్ చేసుకున్నాడట క్రిష్. 6నెలల్లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించాడట ఈ డైరెక్టర్.
ప్రస్తుతం బాలకృష్ణ కూడా తన ఫోకస్ మొత్తం ఈ చిత్రం పైనే పెట్టాడట. ఈ సినిమా పూర్తిచేశాకే మరో సినిమాలో నటించనున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న ఈచిత్రంలో రానా ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో అయన కనిపించనున్నారు. ఇక ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా తరువాత క్రిష్, బాలకృష్ణ కలయికలో రానున్న ఈచిత్రం ఫై భారీ అంచనాలు ఉన్నాయి .


