ఆ రెండు చిత్రాలు కోసం ఎదురుచూస్తున్నా – క్రిష్

Published on Sep 3, 2018 3:51 pm IST


తెలుగు సినీపరిశ్రమలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటడ్ అండ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ రెండు చిన్న చిత్రాలు కోసం ఎదురుచూస్తున్నాడట. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. నూతన దర్శకుడు మహా దర్శకత్వంలో రూపొందిన ‘కేరాఫ్ కంచెర పాలెం’ చిత్రం ఒకటి కాగా, రెండో చిత్రం గౌతమ్‌ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్‌ గా ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో రాబోతున్న ‘మను’ చిత్రం.

ఓ విభిన్నమైన కథ కథనాలతో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులతో పాటుగా సినీ ప్రముఖులను కూడా బాగా ఆకర్షిస్తున్నాయి. దానికి తోడు ‘కేరాఫ్ కంచెర పాలెం’ చిత్రాన్ని ఏకంగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకం పై ‘రానా దగ్గుబాటి’ సమర్పిస్తుండటం, పరిశ్రమలోని టాప్ డైరెక్టర్స్ అందరూ ఈ చిత్రం గురించి గొప్పగా చెప్పడంతో సహజంగానే ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే టీజర్, ట్రైలర్ తోఆకట్టుకున్న మను చిత్రం మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే క్రిష్ కూడా తాజాగా సెప్టెంబర్ 7న విడుదల కాబోతున్న ఈ రెండు చిత్రాలు గురించి ఎదురు చూస్తున్నా అని వ్యాఖ్యానించారు.

సంబంధిత సమాచారం :