మెగా హీరో సినిమాకు క్రిష్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది.!

Published on Oct 24, 2020 1:09 pm IST

తనదైన సినిమాలతో మన దక్షిణాదిలో మరియు హిందీ మార్కెట్ లో కూడా మంచి ముద్ర వేసుకున్న విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇప్పుడు ఇద్దరు మెగా హీరోలసినిమాలతో బిజీగా ఉన్నారు. మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక ఎపిక్ పీరియాడిక్ డ్రామాను ప్లాన్ చేసిన క్రిష్ తర్వాత లాక్ డౌన్ వల్ల షూట్ ను ఆపాల్సి వచ్చింది.

కేవలం కొన్ని రోజుల షూట్ ను మాత్రమే జరుపుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ కు పవన్ అందాకా హాజరు కాని నేపథ్యంలో ఈ గ్యాప్ ను మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ తో పూరించాలని పూనుకున్నారు. అలా సింగిల్ షెడ్యూల్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రానికి ఇపుడు క్రిష్ మరింత జాగ్రత్తలు తీసుకొని పక్కా ప్లానింగ్ తో దూసుకెళ్ళిపోతున్నారు.

షూటింగ్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ నుంచి శరవేగంగా జరుపుతున్న వీడియోను బయటపెట్టారు. 35 రోజుల్లో దాదాపు షూటింగ్ అంతటిని పూర్తి చేసేసుకున్న ఈ చిత్రం ఇంకా ఒక్క సాంగ్ ను మాత్రమే బ్యాలన్స్ గా ఉంచుకుంది. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ వేసిన పక్కా ప్లానింగ్ మాత్రం సూపర్బ్ గా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More