‘ప్రేమిస్తే’ సినిమాలో విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ నటుడు ఆ తర్వాత రవితేజ నటించిన ‘కృష్ణ’ మొదలైన తెలుగు సినిమాల్లో నటించాడు. ఆయన ఈ రోజు చెన్నై లో హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఈ విష్యం తెలిసిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయారు.
దండపాణి శరత్ కుమార్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. కానీ అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా చనిపోవడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. కాదల్ దండపాణిగా ఫేమస్ అయిన ఈయన సుమారు 160 సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళంలో ఎక్కువగా నెగటివ్ రోల్స్ చేసి బాగా ఫేమస్ అయ్యాడు.
దండపాణి అకాల మరణం కారణంగా మా 123తెలుగు.కామ్ తరపున ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం.


