మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరిలేరు నీకెవ్వరు నేడు థియేటర్స్ లోకి వచ్చేసింది. ముందుగానే దర్శక నిర్మాతలు చెప్పినట్టుగా సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి భోజనం ప్లేట్ లా నిండుగా ఉంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఫుల్ ప్యాక్డ్ చిత్రం సరిలేరు నీకెవ్వరు అని టాక్ వినపడుతుంది.సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ చాలా హ్యాపీగా ఫీలయ్యారట. ఆ విషయాన్ని చిత్ర నిర్మాత అనిల్ సుంకర ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మహేష్ డాన్సులు మరియు నటన , సినిమాను అనిల్ రావిపూడి తీర్చిద్దిన విధానం ఆయనకు విపరీతంగా నచ్చిందట. తమ నిర్మాణంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి కృష్ణ గారు అభినందలు తెలిపినందు అనిల్ సుంకర ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయ శాంతి, ప్రకాష్ రాజ్, సంగీత, రావు రమేష్ వంటి నటులు ఇతర కీలక పాత్రలలో నటించారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర చిత్రాన్ని నిర్మించగా దేవిశ్రీ సంగీతం అందించారు.
Just spoke to superstar Krishna garu. He is very very happy about SarileruNeekevvaru. Loved the way @AnilRavipudi dealt his scene. He loved @urstrulyMahesh dances and performance. Thanks Krishna garu, your words made our day today.
— Anil Sunkara (@AnilSunkara1) January 11, 2020


