పుకార్లను కొట్టిపారేసిన కృష్ణ వంశీ

Published on Jan 23, 2014 3:00 pm IST

krishna-vamsi
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 6న మొదలు కానుంది. కొంతమంది ఈ సినిమా ప్రొడక్షన్ టీంకి ‘గోవిందుడు అందరివాడేలే’ అనే టైటిల్ ని అనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ టైటిల్ పై వస్తున్న పుకార్లను కృష్ణవంశీ కొట్టిపారేశారు. ‘నేను ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని ఫైనలైజ్ చెయ్యలేదు. మేము చాలా టైటిల్స్ ని చూస్తున్నాం. వేరే వేరే టైటిల్స్ ని దయచేసి ప్రచారం చేయొద్దు. టైటిల్ ఫైనలైజ్ అయ్యాక మేము అధికారికంగా తెలియజేస్తామని’ కృష్ణవంశీ అన్నాడు.

రామ్ చరణ్, కాజల గర్వాల్ జనటగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ కాంత్ – కమలినీ ముఖర్జీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :