‘రుద్రాక్ష’తో రానున్న క్రియేటివ్ డైరెక్టర్ !

Published on Jun 24, 2019 3:24 pm IST

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ల్లో ‘కృష్ణ వంశీ’ పేరు ముందు వరసలో ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ వినూత్న దర్శకుడు ఇప్పుడు ‘రుద్రాక్ష’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఇక ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణ వంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. ఏమైనా కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రేమ కథా చిత్రాలు తియ్యడంలో కృష్ణ వంశీ’ శైలే వేరు. ఆర్టిస్ట్ ల నుంచి నటనను రాబట్టడంలో గాని, మంచి కంటెంట్ ఉన్న స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకోవడంలో గాని ఆయనకు మంచి అభిరుచి ఉంది.

సంబంధిత సమాచారం :

X
More