కృష్ణ వంశీ కథకి ఎన్.టి.ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.?

కృష్ణ వంశీ కథకి ఎన్.టి.ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.?

Published on Nov 18, 2014 7:17 PM IST

ntr
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇటీవల చేసిన ‘గోవిందుడు అందరివాడేలే ‘ సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. సినిమా విజయంతో కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన కృష్ణవంశీ తాజాగా ఎన్.టి.ఆర్ ని కలిసి కథ చెప్పాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ సినిమా కోసం గోవా లో షూటింగ్ చేస్తున్నాడు. గోవా వెళ్ళిన కృష్ణవంశీ ఎన్.టి.ఆర్ ని కలిసి స్టొరీ లైన్ చెప్పడమే కాకుండా, దానికి సంబందించిన కథ చర్చలు కూడా చేస్తున్నాడు.

ఇప్పటి వరకూ జరిగిన చర్చల ప్రకారం స్క్రిప్ట్ విషయంలో అటు ఎన్.టి.ఆర్, ఇటు కృష్ణవంశీ హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. ఈ చర్చలు ముగిసే సరికి ఎన్.టి.ఆర్ కృష్ణవంశీ చెప్పిన సబ్జెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మరి ఈ చర్చల్లో కృష్ణవంశీ స్టొరీ లైన్ కి ఎన్.టి.ఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.? లేదా.? అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

గతంలో ఎన్.టి.ఆర్ – కృష్ణవంశీ కాంబినేషన్ లో సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ‘రాఖీ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఒకవేళ వీరిద్దరూ మళ్ళీ కలిసి సినిమా చేస్తే ఎలాంటి సినిమా చేస్తారా అనే విషయం అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు