టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి అయిందని తెలుస్తోంది. ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉందట ఈ సినిమా. కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.
ఇక కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. అనసూయ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట. నాటకాలు వేసే కళాకారిణిగా ఆమె నటిస్తోందట. పైగా జీవితాంతం అవివాహితగానే ఉండే స్త్రీ పాత్రలో అనసూయ నటిస్తోందట. ఇక ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.


