టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా జరుపుకుంటూ త్వరలో విడుదలకు కూడా సన్నద్ధం అవుతుందట. మే మూడో వారంలో ఎక్కువుగా సినిమాలు రిలీజ్ కి లేవు కాబట్టి.. ఆ టైంలో తన సినిమాని రిలీజ్ చేయాలని కృష్ణవంశీ ప్రస్తుతం ప్లాన్ చేసుకుంటున్నాడు.
మరి చూడాలి, కృష్ణవంశీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అనసూయ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట. నాటకాలు వేసే కళాకారిణిగా ఆమె నటిస్తోందట. ఇక ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.
