‘రంగమార్తాండ’ రెడీ అయ్యాడు !

Published on Feb 28, 2021 7:18 pm IST

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురుచూస్తూ ఈ క్రమంలో చేస్తోన్న సినిమా ‘రంగమార్తాండ’. కాగా ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినట్టు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయట. మేకర్స్ రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. అనసూయ పాత్ర కథలో కీలకంగా ఉంటుందట. నాటకాలు వేసే కళాకారిణిగా ఆమె నటిస్తోందట.

కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. కానీ ఈ మధ్య ఆయన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ వినూత్న దర్శకుడికి ‘రంగమార్తాండ’ హిట్ అవ్వాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :