ఆమె మృతి విషయం కృష్ణకు అప్పటివరకు తెలియదు.

Published on Jun 27, 2019 8:02 pm IST

బుధవారం అర్ధరాత్రి నటి విజయ నిర్మల హఠాన్మరణం పొందడంతో కృష్ణ కన్నీటి పర్యంతరం అయ్యారు. ఆమెతో ఆయనకు గల 50 ఏళ్ల తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కృష్ణ చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 1969లో విజయనిర్మలను రెండవ వివాహం చేసుకున్న కృష్ణ ఆమెతో విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నారు. వీరిద్దరు కలిసి దాదాపు 50 సినిమాలలో కలిసి నటించారు. పరిశ్రమకు చెందిన ఏ కార్యక్రంలో నైనా,వేడుకలకైనా వీరిద్దరూ జంటగా హాజరయ్యేవారు.

ఇదిలా ఉండగా విజయనిర్మల మృతి విషయాన్ని గురువారం ఉదయం వరకు కృష్ణకు ఎవరూ చెప్పలేదు. ఇంట్లో హడావిడిని చూసిన కృష్ణ అడిగిన తరువాతనే విజయనిర్మల మృతి చెందినట్టు ఆయనకు చెప్పారట. దీనితో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారట. కాగా రేపు చిలుకూరిలోని పామ్ హౌస్ లో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

సంబంధిత సమాచారం :

More