
‘ప్రేమ కథా చిత్రమ్’ తర్వాత సుధీర్ బాబు, నందిత మరోసారి జంటగా నటించిన సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఆర్.చంద్రు దర్శకత్వం వహించారు. హరి సంగీత దర్శకుడు. జనవరి 25న విజయవాడలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అభిమానుల సమక్షంలో భారి ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ తెలుగు తెరపై వచ్చిన ప్రేమకథలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు దగ్గుబాటి రానా, అక్కినేని నాగ చైతన్య అతిధి పాత్రలలో నటించారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నడలో ఘన విజయం సాదించిన ‘చార్మినార్’ ఈ చిత్రానికి రీమేక్ ఇది. గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ, కిషోర్ దాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.