‘రాధేశ్యామ్’ అప్డేట్స్ రివీల్ చేసిన కృష్ణంరాజుగారు

Published on Jan 20, 2021 7:11 pm IST


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుగారు కూడ ఒక కీ రోల్ చేస్తున్నట్టు చాలారోజుల నుండి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలు నిజమేనని కృష్ణంరాజుగారు తెలిపారు.

తన పుట్టినరోజు సందర్బంగా ఒక వార్త ఛానెల్ నందు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన సినిమాలో తాను ఒక కీ రోల్ చేస్తున్నానని, ఆ పాత్ర పేరు పరమహంస అని అది మహాజ్ఞాని, గొప్పవ్యక్తి పాత్ర అని చెప్పుకొచ్చారు. ఆ పాత్ర కోసమే గడ్డం పెంచి కొత్త లుక్ ట్రై చేశానని అన్నారు. సినిమా ఎలా ఉంటుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ రెండేళ్లు ఆలోచించి సినిమా చేస్తున్నాం. నాకు, ప్రభాస్ కు మధ్యన కొన్ని సన్నివేశాలు మిగిలున్నాయి, పాటలు మొత్తం పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడ జరుగుతోంది అన్నారు. డిసెంబర్లో రిలీజ్ చేయాలనుకున్నాం కానీ కోవిడ్ వలన ఆలస్యం అయింది. ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం అన్నారు. మొత్తానికి అభిమానులు కోరుకుంటున్న పలు విషయాల మీద కృష్ణరాజుగారే నేరుగా క్లారిటీ ఇచ్చేశారు.

సంబంధిత సమాచారం :