నాని ద్విపాత్రాభినయం చేస్తోన్న ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సట్టిఫికేట్ పొందింది. ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు హిపాప్ తమిజ సంగీతం అందించగా వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాకు మహర్షి రచన సహకారం అందిస్తున్నారు. ‘వెంకటాద్రి ఎక్ష్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాల తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై మంచి హోప్స్ ఉన్నాయి. బ్రహ్మాజీ, రాజేంద్ర ప్రసాద్, సుబ్బరాజు ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
