విడుదలకు సిద్దమైన ‘కృష్ణార్జున యుద్ధం’ ట్రైలర్ !

31st, March 2018 - 04:01:07 PM


నేచ్యురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మెర్లకపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. వరుస హిట్లమీదున్న నాని ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం 6 గంటలకు తిరుపతిలోని నెహ్రు మున్సిపల్ గ్రౌండ్స్ లో జరగనుంది.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఈరోజు సాయంత్రం 8 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్దిలు సంయుక్తంగా నిర్మిస్తుండగా ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హిపాప్ తమిజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.