క్రిష్ బాలీవుడ్ సినిమాకు భారీ ఓపెనింగ్స్!

క్రిష్ బాలీవుడ్ సినిమాకు భారీ ఓపెనింగ్స్!

Published on May 4, 2015 4:21 PM IST

krish
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ లాంటి సినిమాలతో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న క్రిష్.. గబ్బర్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. శృతి హాసన్, కరీనా కపూర్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మేడే కానుకగా మే 1న విడుదలైంది. గతంలో తమిళంలో నిర్మించబడి సూపర్ హిట్‌గా నిలిచిన మురుగదాస్ సినిమా ‘రమణ’కి రీమేకే ఈ గబ్బర్. ఇక ‘రమణ’ సినిమా, తెలుగులో ‘ఠాగూర్’ పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ అయి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇక విడుదలతోనే మంచి పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ పరంగానూ మంచి వసూళ్ళను రాబట్టుకుంటోంది. 2015లో బాలీవుడ్‌లో విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా గబ్బర్ నిలిచింది. మొదటి మూడు రోజుల్లో( ఓపెనింగ్ వీకెండ్) ఈ సినిమా దేశవ్యాప్తంగా సుమారు 40కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటివరకూ ఈ ఏడాదిలో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ గబ్బర్ సినిమాయే సాధించడం విశేషం. ఒక పవర్ఫుల్ సోషల్ మెసేజ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కమర్షియల్‌గానూ పర్ఫెక్ట్‌గా రూపొందడంతో మరో రెండు వారాలు ఈ సినిమాకు తిరుగుండదనేది ట్రేడ్ టాక్.

తాజా వార్తలు