రామ్ చరణ్ సినిమాలో కృతి కర్బంద.!

ram-charan--Kriti-kharbanda
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – శ్రీనువైట్లల కాంబినేషన్ లో రానున్న సినిమా మార్చి 5 లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభమ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా చివరి దశకు చేరుకుంటున్నాయి. శ్రీను వైట్ల – కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి ఈ సినిమాని స్క్రిప్ట్ చాలా పర్ఫెక్ట్ గా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కన్నడ భామ కృతి కర్భంద ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది.

‘తీన్ మార్’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలో కనిపించిన కృతి కర్బంద చాలా రోజుల తర్వాత మళ్ళీ రామ్ చరణ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు కనిపించనుంది. కృతి కర్బంద తో పాటు రావు రమేష్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విన్ని కూడా ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేసారు=] మరోవైపు రామ్ చరణ్ తల్లి పాత్రకి జీవితా రాజశేఖర్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటూనే రామ్ చరణ్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాని అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. డివివి దానయ్య ఈ సినిమాకి నిర్మాత.

Exit mobile version