
‘1 నేనొక్కడినే’ సినిమాతో వెండితెరకు పరిచయమైన కృతి సనన్.. తన మొదటి సినిమాతోనే అందంలో, నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోపంతీ సినిమాలో నటించిన కృతి, ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తాజాగా బాలీవుడ్‌లో రూపొందనున్న ఓ భారీ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటించనుంది. షారూఖ్ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘దిల్‌వాలే’లో ఓ పాత్రకు కృతి సనన్ ఎంపికైంది.
ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ఫరాహ్ ఖాన్ కథ అందించారు. తాను గతంలో దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రాలైన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘బోల్ బచ్చన్’ తరహాలోనే దిల్‌వాలే సినిమాను కూడా యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు రోహిత్. ఈ సినిమా ఈ నెల్లోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం నాగ చైతన్య సరసన ‘దోచేయ్’ సినిమాలో నటిస్తోన్న కృతి, ఆ తర్వాత దిల్‌వాలే చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.

