మహేష్ బాబు హీరోగా నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ కృతి సనన్. ఆ సినిమా అనుకున్నంత హిట్ కాకపోయినప్పటికీ కృతి సనన్ కి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఇది రిలీజ్ ఎయిన 6 నెలల తర్వాత కృతి సనన్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య సరసన ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ లో కృతి సనన్ జాయిన్ అయ్యింది. కృతి సనన్ తన పాత్ర గురించి, నాగ చైతన్య గురించి మాట్లాడుతూ ‘ ఈ స్క్రిప్ట్ వినగానే నేను నో చెప్పలేకపోయాను. ఇందులో నా కంటూ ఓ స్టైల్ ఉంటూ మోడరన్ గా కనిపించే అమ్మాయి. ప్రస్తుతానికి అంతకన్నా ఎక్కువ చెప్పలేను కానీ నా రోల్ మాత్రం ఆడియన్స్ కి పెద్ద ట్రీట్ అని చెప్పగలను. నాగ చైతన్యతో క్లోజ్ అవ్వడానికి నాకు కాస్త టైం పట్టింది. నాగ చైతన్య ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఆ విషయం నాకు బాగా నచ్చిందని’ చెప్పింది.
అత్తారింటికి దారేది సినిమా తర్వాత శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి ‘మాయగాడు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.


