మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా అలానే తన దర్శకత్వంలో మొదటి సినిమాగా తన కెరీర్ 23వ సినిమాగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక క్రేజీ థ్రిల్లర్ గా రామ్ పోతినేని తన సినిమాని షేప్ అవుట్ చేసుకోగా అభిమానులు ఓ రేంజ్ లో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ని తాను అందించాడు. ఈ చిత్రానికి పలు పాపులర్ సినిమాలు క్రిష్ 3, ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి భారీ సినిమాలకి కెమెరా వర్క్ అందించిన పాపులర్ సినిమాటోగ్రాఫర్ తిరు సాలిడ్ విజువల్స్ ని అందించనున్నారని సాలిడ్ అప్డేట్ ని ఇప్పుడు అందించాడు.
దీనితో పాటుగా తనతో వర్క్ విషయంలో రామ్ పోతినేని తన ఎగ్జైట్మెంట్ ని తెలిపాడు. సో ఈ సినిమాకి తన వర్క్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇతర వివరాలు మున్ముందు రానున్నాయి. అలాగే ఈ సినిమాని రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
A master craftsman behind the visual spectacles is ready to enter into the Neo-noir world of #RAPO23 ❤️🔥
Honoured to have the visionary cinematographer @DOP_Tirru Garu on board.
Starring the Energetic Star @ramsayz 💥
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna… pic.twitter.com/WSO0BXSSIK— RAPO Cinematics (@RAPO_Cinematics) June 6, 2026


