ప్రేమ కథల దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తేజ్ ఐలవ్యూ’. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత కే ఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా విశాఖపట్నంలో ‘తేజ్ ఐలవ్యూ’ ఆడియో సక్సెస్ మీట్ ఫంక్షన్ జరుపుకుంది. ఈ సందర్భంలో నిర్మాత కేఎస్ రామారావు మట్లాడుతూ.. నేనిలా నిర్మాతగా మారడానికి కారణం విశాఖపట్నమే. లెంజెండ్ దర్శకుడు బాలచందర్‌గారి మరో చరిత్ర సినిమా చూస్తున్నప్పుడు నాకనిపించింది. నేను నిర్మాత అయ్యాక ఎట్టిపరిస్థితుల్లో ఈ విశాఖపట్నం నేపథ్యంలోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.
ఆ నిర్ణయం ప్రకారమే చిరంజీవిగారు నటించిన నా మొదటి చిత్రం అభిలాషను విశాఖలోనే చేశా. ఆ తర్వాత మా బ్యానర్ లో తెరకెక్కిన చాలా సినిమాలను వైజాగ్‌లోనే రూపొందించటం జరిగింది. ఇక, తేజ్ ఐలవ్యూ’ చిత్రానికి వస్తే హీరోగా నటించిన సాయిధరమ్ తేజ్ లో.. ఆ రోజుల్లో చిరంజీవిగారిలో ఉన్నంత ఎనర్జీ ఉంది. దర్శకుడితో పాటు చిత్ర యూనిట్ అంతా ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడింది. ఆ కష్టానికి ఫలితంగా ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. ‘తేజ్ ఐలవ్యూ’ చిత్రంలో తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.


