‘కెఎస్‌ 100’ అన్ని వర్గాల్ని ఆకట్టుకునే రొమాంటిక్‌ హర్రర్‌ – దర్శకుడు షేర్‌

‘కెఎస్‌ 100’ అన్ని వర్గాల్ని ఆకట్టుకునే రొమాంటిక్‌ హర్రర్‌ – దర్శకుడు షేర్‌

Published on Jul 2, 2019 2:00 AM IST

షేర్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజలను హీరో హీరొయిన్లుగా పరిచయం చేస్తూ.. చంద్రశేఖరా మూవీస్ పతాకం పై వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “కెఎస్100”. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా జులై 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు షేర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మాది హైదరాబాద్‌ ఇక్కడే పుట్టి పెరిగాను. అయితే హాలీవుడ్‌ మూవీ ‘మిషిన్‌ ఇంపాజిబుల్‌ ఘోస్ట్‌ ప్రోటోకాల్‌’ కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసి అక్కడి టెక్నిక్స్‌ నేర్చుకున్నాను. ఆ తరువాత ఇండియాకి వచ్చి సినిమా మీద ఉన్న ఫ్యాషన్‌తో దర్శకుడినయ్యాను. ఇక ఈ సినిమాకి నేనే స్టోరీ స్క్రీన్‌ ప్లే దర్శకత్వ బాధ్యతలు వహించాను. హాలీవుడ్‌ తరహాలో ఉండే ఒక రొమాంటిక్‌ హారర్‌ చిత్రం.

దర్శకుడు షేర్ ఇంకా మాట్లాడుతూ.. ‘కేవలం హారర్‌ కాకుండా మంచి ఎమోషన్‌ కూడా ఉంటుంది. ఫస్ట్‌ ఆఫ్‌ మొత్తం హారర్‌, కామెడీతో ఎంటర్‌ టైనింగ్‌గా సాగుతూ సెకండ్‌హాఫ్‌కి వచ్చేసరికి మంచి ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన ఒక సందేశాత్మక చిత్రం ఇది, ఒక ఫ్రెష్‌ ఫీల్‌ ఉండే హర్రర్‌ సినిమా.. నలుగురు అమ్మయిలు వెకేషన్‌కి ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ వారికి ఏదో ఆత్మ ఉందని తెలుస్తుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది ? అక్కడే ఎందుకు ఉంది, వారు దాని బారి నుండి ఎలా బయటపడ్డారు అనేది సినిమా చూసి తెలుకోవాల్సిందనని చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు