కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ చూసి స్టన్ అయిన కేటిఆర్ !

తెలంగాణ మంత్రి కేటిఆర్ గారికి సినిమాలంటే ఇష్టం కొంచెం ఎక్కువే. సినిమా నటీ ఈ నటులందరితో స్నేహపూర్వకంగా మెలిగే ఆయన మంచి సినిమాల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంటారు. ఈ మధ్య విడుదలైన ‘రంగస్థలం, భరత్ అనే నేను’ లాంటి సినిమాల్ని వీక్షించి పొగిడిన ఆయన తాజాగా ‘మహనటి’ చిత్రాన్ని చూసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘సినిమా చాలా గొప్పగా ఉంది. కీర్తి సురేష్ పాత్రలో జీవించింది. స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ ఔట్ స్టాండింగ్’ అంటూ చిత్ర బృందం మొత్తాన్ని అభినందించారు. ఇలా సినిమా చూసిన చాలా మంది మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తుండంతో సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ లభిస్తోంది.

Exit mobile version