‘వినయ విధేయ రామ’ కోసం కేటీఆర్ కూడా !

Published on Dec 26, 2018 12:24 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ డైరైక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27వ తేదీన యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుందని తెలిసిన విషయమే. అయితే ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవితో పాటు కేటీఆర్ కూడా ముఖ్య అతిధిగా ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈనెల 26తో పూర్తి కానుంది.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :