Kubera Poster: రష్మిక – ధనుష్ జంట మెస్మరైజ్ చేయనుందా..?

Kubera Poster: రష్మిక – ధనుష్ జంట మెస్మరైజ్ చేయనుందా..?

Published on May 8, 2025 1:00 AM IST

kuera

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘కుబేర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఫాలో అవుతూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర కౌంట్‌డౌన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ధనుష్, రష్మిక మనకు కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఈ జోడీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక తనదైన మార్క్ టేకింగ్‌తో శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందిస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా జూన్ 20న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

తాజా వార్తలు