‘కుమారి 21 ఎఫ్’ ఆడియో రిలీజ్‌కు భారీ ప్లాన్స్!

kumari-21-f
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి ‘సుకుమార్ రైటింగ్స్’ అన్న బ్యానర్‌పై రూపొందించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన రోజునుంచే ‘కుమారి 21 ఎఫ్’ క్రేజీగా మారిపోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా ఆడియో రిలీజ్‌కు ప్రత్యేక అతిథిగా హాజరుకానుండడం విశేషంగా మారింది. రేపు హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనుండడంతో పాటు ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లోనూ దేవిశ్రీ స్పెషల్ పర్ఫామెన్స్ హైలైట్ కానుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్‌గా రానుండడంతో ఈ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సుకుమార్ ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ కల్పించడంలో బాగా సక్సెస్ అవుతూ వస్తున్నారనే చెప్పొచ్చు.

Exit mobile version