
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి ‘సుకుమార్ రైటింగ్స్’ అన్న బ్యానర్‌పై రూపొందించిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన రోజునుంచే ‘కుమారి 21 ఎఫ్’ క్రేజీగా మారిపోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా ఆడియోను విడుదల చేయడం సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక వైభవంగా జరిగింది. అల్లు అర్జున్ ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా పాల్గొని హైలైట్‌గా నిలిచారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “కుమారి 21 ఎఫ్ నిర్మాతగా మారిన సుకుమార్‌కు శుభాకాంక్షలు. సుకుమార్ ఫ్రెండ్షిప్ కోసం ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా పనిచేసిన రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్‌లను మెచ్చుకొని తీరాలి. సుకుమార్ అంటే నాకెంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నిర్మాతగా ఈ సినిమా మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇక బన్నీ మాట్లాడుతుండగా ఆర్య 3, ఆర్య ౩ చేయండి అన్న అభిమానుల అరుపులకు స్పందిస్తూ.. “ఆర్య 3 కాదు కానీ, సుకుమార్‌తో ఆర్యను మించిపోయే సినిమా చేస్తా” అని సమాధానమిచ్చారు. ఇక సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన కుమారి 21 ఎఫ్ సినిమాలో హీబా పటేల్ హీరోయిన్గా నటించారు.

