యువతలో ‘కుమారి 21F’కి సూపర్బ్ క్రేజ్

యువతలో ‘కుమారి 21F’కి సూపర్బ్ క్రేజ్

Published on Nov 16, 2015 4:24 PM IST

Kumari-21f

క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే చాలు ఆ సినిమా పెద్దదైనా చిన్నదైనా ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఆ తర్వాత వచ్చే ట్రైలర్, సాంగ్స్ బాగుంటే ఇంకా ఎక్కువ అంచనాలతో ఆ సినిమాకి బిజినెస్ కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇప్పుడు ఇదే ఫీచర్స్ తో రానున్న సినిమా ‘కుమారి 21F’. ఈ సినిమాకి ఎందుకంత క్రేజ్ అంటే డిఫరెంట్ పాత్రలను సృష్టించి, వాటికి ఓ చిత్రమైన స్క్రీన్‌ప్లే ని జోడించి సినిమాలు తీసి తెలుగులో టాప్ డైరెక్టర్‌‌లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగానే కాకుండా కథ – స్క్రీన్ ప్లే కూడా అందించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ హీరోగా సినిమా చేయడం ఈ సినిమాకి మొదటి హైలైట్.

అ తర్వాత ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ అయిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ పని చేయడం మరో హైలైట్. ఆ తర్వాత ఎన్.టి.ఆర్మ అల్లు అర్జున్ లు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం. వీటితో పాటు ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ ఆకట్టుకోవడం మరో హైలైట్. సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా నవంబర్ 20న రిలీజ్ కానుంది. సెన్సార్ తర్వాత ఇండస్ట్రీలో ఈ సినిమా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. ముఖ్యంగా సుకుమార్ ఫ్లేవర్ ఈ సినిమాలో కనిపిస్తుండడంతో యువతలో సినిమాకి మంచి క్రేజ్ నెలకొంది. ముందు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ ఉండడం వలన ఈ సినిమాకి బిజినెస్ కూడా బాగా జరిగింది.

ఓవరాల్ గా చాలా ఎక్కువ థియేటర్స్ లోనే ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సినిమా రిలీజ్ కి ముందే ఇంత పాజిటి రెస్పాన్స్ రావడం సినిమాకి సూపర్బ్ ఓపెనింగ్స్ తెప్పిస్తుందని ఈ చిత్ర ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హేభ పటేల్ హీరోయిన్‌గా కనిపించనున్న ఈ సినిమాకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు