యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కురుక్షేత్రం’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఇది ఆయనకు 150వ సినిమాకావడం విశేషం. ఇటీవల సహజ నటుడు నాని చేతుల మీదుగా విడుదలైన ఈచిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి నవీన్ సంగీతం అందిస్తున్నాడు.
వైభవ్, వరలక్ష్మి శరత్ కుమార్, సుహాసిని , సుమన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వాడపల్లి వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకం ఫై మీసాల శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జెంటిల్మెన్ , ఒకే ఒక్కడు’ సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్న అర్జున్ ఇటీవల ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అభిమన్యుడు’ చిత్రాల్లో నటించి ఈ తరం ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు.


