ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “ఖుషి”

Published on Sep 1, 2023 10:02 am IST

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రమే “ఖుషి”. మరి ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు నెలకొల్పుకొని వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు పాన్ ఇండియా రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ని మెప్పించే విధంగా మంచి మౌత్ టాక్ ని కూడా సంతరించుకుంటూ ఉండగా.

లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ కి సంబంధించి అయితే క్లారిటీ వచ్చింది. ఈ సినిమా హక్కులు అయితే దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. సో పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో చూడవచ్చు. దీనికి కొన్ని వారాల సమయం పడుతుంది. ఇక ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, మురళి శర్మ, రోహిణి తదితర నటులు నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :