ఆనంద్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా ‘హైవే’ ప్రారంభం

ఆనంద్ దేవ‌ర‌కొండ కొత్త సినిమా ‘హైవే’ ప్రారంభం

Published on May 6, 2021 6:00 PM IST

ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫ‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్న కేవీ గుహ‌న్ దర్శకుడిగా మారి తన మొదటి చిత్రం 118 తోనే మంచి హిట్ దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం కేవీ గుహ‌న్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండతో “హైవే” (ఏ న‌ర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి) అనే సినిమాను చేస్తున్నాడు. శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతున్న ఈ సినిమా రోడ్ జ‌ర్నీ నేప‌థ్యంలో సైకో కిల్ల‌ర్-క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి వెంక‌ట్ త‌లారి నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం హైద‌రాబాద్ సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి తుంగ‌తుర్తి ఎంఎల్ఎ గాద‌రి కిశోర్‌కుమార్ క్లాప్ కొట్టగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రం కెమెరా స్విచాన్ చేశారు. ఈ తరుణంలోనే దర్శకుడు కేవీ గుహ‌న్ హీరో ఆనంద్‌ దేవ‌ర‌కొండ‌పై మొద‌టి స‌న్నివేశాన్ని కూడా చిత్రీక‌రించారు. సైమ‌న్ కె.కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్‌ షూటింగ్ జూన్ ఫ‌స్ట్ వీక్ నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

నిర్మాత వెంక‌ట్ త‌లారి మాట్లాడుతూ తొలిచిత్రం “చుట్టాల‌బ్బాయితో” ఘ‌న‌విజ‌యం సాధించిన త‌ర్వాత మా బేన‌ర్‌లో చేస్తున్న రెండో సినిమా “హైవే”. కేవీ గుహ‌న్‌గారు చెప్పిన క‌థ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని ఆయన్ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ హీరోగా శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బేన‌ర్‌పై హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నామని అన్నారు. హైవే నేప‌థ్యంలో ఒక సైకో క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం తమకు ఉందని అన్నారు.

దర్శకుడు కేవీ గుహ‌న్ మాట్లాడుతూ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండతొ చేస్తున్న హైవే మూవీ పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభంకావ‌డం నాకు సంతోషంగా ఉందని, ప్రీ ప్రొడ‌క్ష‌న్ దాదాపుగా పూర్త‌య్యిందని అన్నారు. అయితే ప్రస్తుతం ఆర్టిస్టుల‌, టెక్నీషియ‌న్స్ సెల‌క్ష‌న్ జ‌రుగుతోందని, జూన్ ఫ‌స్ట్ వీక్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఇటీవల మిడిల్‌క్లాస్ మెలోడీస్ చిత్రంతో అంద‌రినీ ఆక‌ట్టుకున్న
హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ నేను ఫ‌స్ట్ టైమ్ ఒక ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్ట‌ర్‌తో వ‌ర్క్ చేస్తున్నానని, గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్‌లో సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా ఉందని అన్నారు. అయితే ఈ మూవీ త‌ప్ప‌కుండా ఒక గ్రేట్ మూవీ అవుతుందని, నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన గుహ‌న్ గారికి, వెంక‌ట్ త‌లారి గారికి, ర‌మేష్‌గారికి ద‌న్య‌వాధాలు తెలిపారు.

ఇక తుంగ‌తుర్తి ఎంఎల్ఎ గాద‌రి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ ఈ చిత్ర నిర్మాత వెంక‌ట్ త‌లారి నాకు అత్యంత స‌న్నిహితుడని, గుహ‌న్ గారికి సినిమా అంటే చాలా ప్యాష‌న్ అని అన్నారు. కెమెరామేన్‌గా ఎంతో ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న గుహ‌న్ గారితో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఈ మూవీ మంచి విజ‌యం సాధించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నానని, ఈ బేన‌ర్‌లో మ‌రిన్ని మంచి మూవీస్‌ని వెంక‌ట్ త‌లారి తీసుకురావాల‌ని కోరుకుంటున్నానని అన్నారు.

ఈ సినిమాకు కెమెరా స్విచాన్ చేసిన ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భద్రం మాట్లాడుతూ శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ త‌లారి వెంక‌ట్‌గారు నాకు మంచి మిత్రులు అని, ఆ బేన‌ర్‌లో నేను డైరెక్ట్ చేసిన తొలిచిత్రం చుట్టాల‌బ్బాయి పెద్ద హిట్ అయ్యిందని, ఇప్పుడు గుహ‌న్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న తీస్తున్న రెండ‌వ చిత్రం హైవే పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు