ఒక వారం వెనక్కి వెళ్ళిన ‘లేడీస్ & జంటిల్ మెన్’..!

ఒక వారం వెనక్కి వెళ్ళిన ‘లేడీస్ & జంటిల్ మెన్’..!

Published on Jan 16, 2015 12:41 PM IST

ladies-and-jentile-man

నిర్మాతగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమాలను అందిస్తున్న దర్శకుడు మధుర శ్రీధర్. నిర్మాతగా ‘మాయ’ సినిమాతో హిందీ చిత్రసీమ ప్రముఖులను ఆకర్షించారు మధుర శ్రీధర్. తాజాగా ‘లేడీస్ & జంటిల్ మెన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యారు. ముందుగా ఈ సినిమాని జనవరి 23న రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ ఈ చిత్ర టీం ఈ సినిమాని ఒక వారం వెనక్కి వాయిదా వేసి జనవరి 30న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసింది.

సోషల్ మీడియా, సైబర్ నేరాలు యువతరంపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి అనే కధాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా తన శిష్యుడు పిబి మంజునాథ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందించారు. మహాత్ రాఘవేంద్ర, చైతన్య కృష్ణ, అడవి శేష్, కమల్ కామరాజ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్, తేజస్విని ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ కందుకూరి సమర్పణలో షిరిడి సాయి కంబైన్స్ పతాకంపై యంవికె రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు