
తెలుగు తెరకు మరో కొత్త దర్శకురాలు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా పరిచయమవుతున్న సంగతి మేము ముందుగానే ప్రకటించాం. కే.రాఘవేంద్రరావుగారి దగ్గర శిష్యరికం చేసిన చునియా ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. ఈమె గతంలో సూపర్ హిట్ అయిన ‘యువ’ ధారావాహికను తెరకెక్కించారు.
ఈ సినిమా గత నెలలో ప్రారంభమై షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఒక ముఖ్యమైన షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ నెలలో తదుపరి షెడ్యూల్ ని ప్రారంభించి షూటింగ్ ని ముగించానున్నారు.
టిప్పు సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్న కార్తీక్ రాజు ఈ సినిమాలో హీరో. సమీరా హీరోయిన్. ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలను అందించారు. ఈ సినిమాలో ఆలి, కృష్ణుడు, భరణి ముఖ్యపాత్రలు పోషించారు.

