మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన తెలుగమ్మాయి మంచు లక్ష్మీ ఇప్పటికే తను చేసిన సినిమాలు మరియు పాత్రలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా మంచు లక్ష్మీ వర్క్ అవుట్ చేస్తున్న ఓ డైనమిక్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ స్టైలిష్ వీడియోలో మంచు లక్ష్మీ తన ట్రైనర్ తో కలిసి లక్ష్మీ మంచు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ వీడియో అప్పుడే యుట్యూబ్లో సెన్సేషన్ అవుతోంది.
కేవలం వీడియో మాత్రమే కాకుండా తను యోగా చేస్తున్న కొన్ని ఫోటోలను రిలీజ్ చేసారు. దాన్లో మంచు లక్ష్మీ తన బాడీ ఫ్లెక్సిబిలిటీతో వేసిన కొన్ని యోగాసనాలు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. ఈ విషయంపై లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘ ఫీట్ నెస్ లో 80% కీ రోల్ ప్లే చేసేది మన లైఫ్ స్టైల్ మరియు మనం తీసుకునే ఫుడ్ మాత్రమే మన 80% ఫిట్ నెస్ ని నిర్ణయిస్తుంది. మిగతా 20% మనం జిమ్ లో చేసే వర్కౌట్స్ మీద ఆధారపడి ఉంటుందని’ తెలిపింది.
మొదట బుల్లితెరపై రియాలిటీ షోస్ తో అందరినీ ఆకట్టుకున్న మంచు లక్ష్మీ ఆ తర్వాత నిర్మాతగా, నటిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ఇటీవలే మదర్ అయిన లక్ష్మీ మంచు త్వరలోనే ‘బుడుగు’ అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీ మంచు తన మూడు పదుల వయసులో కూడా ఇంత ఫిట్ గా ఉంటూ పలుగురికి స్పూర్తిని ఇస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


