హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న లక్ష్మి రావే మా ఇంటికి

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటున్న లక్ష్మి రావే మా ఇంటికి

Published on May 1, 2014 11:56 AM IST

Lakshmi-Raave-Maa-Intiki

ఉయ్యాలాజంపాలా లో నటించిన అవిక గొర్ తన తదుపరి తెలుగు చిత్రం లక్ష్మి రావే మా ఇంటికి లో కనిపించనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య ప్రధాన పాత్ర పోషించనున్నారు. నంద్యాల రవి రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గిరిధర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ ఏప్రిల్ 24 నుంచి జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రంలోని జంట మధ్య పాటలను చిత్రీకరిస్తున్నారు. మే 13 వరకు సాగనున్న రెండో షెడ్యూల్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన భాగం ఇప్పటికే పూర్తి చేసుకుంది. జూన్ లో కూర్గ్, పాండిచ్చేరి లలో ఈ చిత్ర బృందం మరో పాటను కూడా చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం షూటింగ్ జూలై నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది.

రాధాకృష్ణ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తరువాత తెలుగు లో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అవికగొర్ నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు