ప్రభాస్ హీరో అని తెలియకుండానే మూవీకి సైన్ చేశానంటున్న నటుడు !

Published on May 29, 2018 8:51 pm IST

అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతూ అన్ని సినీ పరిశ్రమల దృష్టినీ తనవైపుకు తిప్పికొన్న సినిమా ‘సాహో’. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రంపై సుమారు రూ.200 కోట్ల వరకు వెచ్చిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులతో పాటు మలయాళ నటుడు లాల్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తాజాగా మీడియాతో మాట్లాడిన అయన సుజీత్ నన్ను కలిసి, నా పాత్రను గురించి చెప్పి, నేను సినిమా చేసేందుకు ఒప్పుకున్నప్పుడు అందులో ప్రభాస్ హీరో అని నాకు తెలియదు. అసలు సినిమా పూర్తి కథేమిటో ఇప్పటికీ తెలీదు. సుజీత్ ముఖ్యమైన కొందరు నటీ నటులకు మాత్రమే కథను చెప్పి ఉంటారని నేను భావిస్తున్నాను అన్నారు.

ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ ను కూడా ముగించుకుంది ఈ సినిమా వచ్చే నెలలో రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ జరుపుకోనుంది. ఆ తర్వాత యూరప్లో కూడ కొంత షూటింగ్ జరగనుంది.

సంబంధిత సమాచారం :