ఆకట్టుకుంటున్న “లాల్ సలామ్” టీజర్

ఆకట్టుకుంటున్న “లాల్ సలామ్” టీజర్

Published on Nov 12, 2023 6:58 PM IST

Lal Salaam
సూపర్ స్టార్ రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనిల్ కుమార్, వివేక్ ప్రసన్న లు ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లాల్ సలామ్. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా కి సంబందించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ను తమిళ బాషలో మాత్రమే కాకుండా, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు