మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ డబ్బు కోసం ఆశ పడే వ్యక్తి అంటూ ఆమె పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నెగిటివ్ కామెంట్స్ పై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘సుస్మిత కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె వద్దే ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. ఆమె వాటన్నింటినీ స్వయంగా సంపాదించుకుంది. చివరికి ఆమెకు డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి’ అంటూ లలిత్ మోదీ తెలిపారు.
లలిత్ మోదీ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను, సుస్మితా సేన్ కలిసి ఉన్న సమయంలో ఆమె ఎక్కువ ఖర్చు పెట్టేది. అందుకే, మేం బయటకు వెళ్లినప్పుడు నేను దేనికీ డబ్బులు చెల్లించాల్సిన సందర్భమే రాలేదు. ఆమెనే అన్నింటికీ డబ్బులు కట్టేది. నేనే ఆమె డబ్బులపై ఆధారపడేవాడిని. ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించడానికి ఇష్టపడదు. ఆమె గురించి తెలియనివాళ్లు మాత్రమే అలాంటి ఆరోపణలు చేస్తారు. నా దృష్టిలో సుస్మితా సేన్ ఓ అద్భుతం’ అంటూ లలిత్ మోదీ తెలిపాడు.


