నేటితో ‘రభస’కి గుమ్మడికాయ కొట్టనున్న టీం

Published on Jul 23, 2014 11:44 am IST

Rabhasa
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ ఈ రోజుతో ముగియనుంది. ఫైనల్ డే షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దాదాపు ఒక సంవత్సరంగా ఈ సినిమా కోసం పనిచేస్తున్న ఈ చిత్ర టీం నేటితో ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేయనున్నారు.

ఈ సినిమా ఆడియోని ఆగష్టు 1న రిలీజ్ చేసి సినిమాని ఆగష్టు 14న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకి గత కొద్ది రోజులుగా వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసిన ఎన్.టి.ఆర్ ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుందని చిత్ర టీం అంటోంది.

ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి బెల్లంకొండ సురేష్ నిర్మాత.

సంబంధిత సమాచారం :