హీరో ‘ఆది’ తాజాగా నటిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. దర్శకుడు ‘వీరభద్రం’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ రోజుతో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకోనుంది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ఈ సినిమాతో ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటాడని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఎస్ ఎస్. థమన్ స్వరపరిచిన గీతాలు ఫ్రెష్ ఫీల్ తో ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని ఆగష్టు 5న విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. వెంకట్ తలారి, రామ్ తల్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో ఆది సరసన నమిత ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వి, పోసాని, అలీ వంటి కామెడీ స్టార్లు సైతం ఈ సినిమాలో నటిస్తున్నారు.


