ఒక్క పాట మినహా పూర్తైన ఎన్.టి.ఆర్ ‘రభస’

Published on Jul 6, 2014 12:17 pm IST

Rabhasa

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తను నటిస్తున్న ‘రభస’ సినిమా షూటింగ్ ని చివరి దశకు తీసుకోచ్చేసాడు. నేటితో ఈ సినిమా టాకీ పార్ట్ పార్ట్ పూర్తి కానుంది. ఆ తర్వాత టాకీ పార్ట్ లో కేవలం పాచ్ వర్క్ సీన్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. టాకీ పార్ట్ కాకుండా మిగిలి ఉన్న ఒక్క పాటని త్వరలో షూట్ చేయనున్నారు.

సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. ఎన్.టి.ఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం సంతోష్ శ్రీనివాస్ కి ఆరోగ్యం బాగో లేనందువల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యమైనా ఇప్పుడు శరవేగంగా పూర్తవుతోంది. ఎన్.టి.ఆర్ ఇందులో పవర్ఫుల్ పాత్రలో కనిపించడమే కాకుండా తన కామెడీ టైమింగ్ తో మరోసారి నవ్వించనున్నాడు. ఆగష్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :