లేటెస్ట్: ‘అఖండ 2’ కొత్త డేట్ లాక్.. బిగ్ అనౌన్సమెంట్ వస్తుందా?

లేటెస్ట్: ‘అఖండ 2’ కొత్త డేట్ లాక్.. బిగ్ అనౌన్సమెంట్ వస్తుందా?

Published on Dec 9, 2025 12:02 AM IST

అఖండ 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమా మొన్ననే విడుదల కావాల్సి ఉంది కానీ ఊహించని కారణాలు రీత్యా సినిమా వాయిదా పడింది. ఇక కొత్త డేట్ కోసం అభిమానులు మరింత ఉత్సాహంగా చూస్తుండగా ఈ డేట్ పై ఫైనల్ గా ఓ క్లారిటీ ఇప్పుడు రాబోతున్నట్టు తెలుస్తుంది.

మరీ ఆలస్యం చేయకుండా వచ్చే వారమే విడుదలకి డేట్ లాక్ చేసేసారట. అంటే డిసెంబర్ 12 నే సినిమా రానుంది అని చెప్పవచ్చు. దీనిపై అధికారిక అప్డేట్ కూడా రేపు రావచ్చని టాక్. సో అఖండ 2 బిగ్ ట్రీట్ రేపే అని చెప్పొచ్చు. అలాగే గ్రాండ్ ప్రీమియర్స్ ఈ 11 నుంచే ఉంటాయని కూడా మరో టాక్. సో వీటి అన్నింటిపై సాలిడ్ క్లారిటీ ఒక్కటి రావడమే బాకీ. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు