“భీమ్లా నాయక్” పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Aug 25, 2021 7:04 am IST

పవర్ స్టార్ కళ్యాణ్ హీరోగా మరో స్టార్ హీరో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ మంచి అంచనాలు పెంచుకుంటూ వెళ్తుంది. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికే అప్ టు డేట్ అదిరే అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మేకర్స్ వచ్చే సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ లాంచ్ చేయనున్నారని తెలిపారు.

అయితే దీనిపైనే ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది. మరి దాని ప్రకారం ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ పై ప్రోమో అనౌన్సమెంట్ ఈ ఆగష్టు నెలాఖరున వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సాలిడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :