“RRR” బ్యాలన్స్ సాంగ్ పై లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

“RRR” బ్యాలన్స్ సాంగ్ పై లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jul 1, 2021 2:48 PM IST

ఇండియన్ సినిమా వద్ద భారీ అంచనాలతో వస్తున్న పలు పాన్ ఇండియన్ చిత్రాల్లో “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మేకర్స్ ఇటీవలే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇచ్చారు. అయితే దాని ప్రకారం ఇంకా రెండు పాటలు సహా డబ్బింగ్ బ్యాలన్స్ ఉన్నట్టు తెలిసింది.

మరి సాంగ్స్ విషయానికి వస్తే రెండూ భారీ గానే ఉంటాయని టాక్ ఉండగా.. మరి వాటిలో లేటెస్ట్ ఇన్ఫో ఒకటి తెలుస్తుంది. ఈ రెండిట్లో ఒకటి చరణ్ మరియు ఆలియా భట్ లపై డిజైన్ చేసిన సాంగ్ అట. అయితే ఇంతకుముందు ఈ సాంగ్ కోసం భారీ సెట్టింగ్స్ వేస్తున్నారని అంతే కాకుండా గ్రాండ్ విజువల్ ట్రీట్ గా కూడా ఉంటుందని తెలిసింది.

మరి ఆ సాంగ్ నే ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించనున్నారట. మరి ఈ సాంగ్ లో రామరాజు, సీత అనుబంధాన్ని అద్భుతంగా చూపించనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ ఒక్క సాంగ్ తియ్యడానికి ఎక్కువ రోజులు సమయాన్నే కేటాయించనున్నారట. మరి విజువల్ గా ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు