లేటెస్ట్..మరో బాలీవుడ్ ప్రముఖ నటుడికి కరోనా..!

Published on Apr 4, 2021 4:51 pm IST

ఇప్పుడు మరోమారు దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఓవరాల్ ఇండియన్ సినిమాకు భారీ నష్టాన్ని మిగిల్చిన కరోనా ఈసారి రెండో వేవ్ లో బాలీవుడ్ పై పగబట్టినట్టు ఉంది. ఇటీవల కాలంలోనే పదుల సంఖ్యలో బాలీవుడ్ స్టార్ నటులు కోవిడ్ బారిన పడ్డారు. మరి ఈరోజే అక్కడి సెన్సేషనల్ స్టేర్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా వచ్చింది అన్న వార్త పొద్దున్నే కలవర పెట్టింది.

మళ్ళీ సరికొత్తగా ఇదే బాలీవుడ్ కు చెండియాన్ ప్రముఖ నటుడు, కామెడీ రోల్స్ స్పెషలిస్ట్ గోవిందా కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. అతనికి కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్నట్టుగా అనిపించగా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని తేలింది. దీనితో గోవిందా ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ తీసుకున్నట్టు సమాచారం. మరి గోవిందా సంపూర్ణ ఆరోగ్యంతో కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :