లేటెస్ట్..”ఆచార్య” టికెట్ రేట్స్ పై ఏపీ ప్రభుత్వం కొత్త జీవో.!

Published on Apr 26, 2022 9:57 am IST

టాలీవుడ్ లెజెండరు హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తీరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య” కోసం తెలిసిందే. అయితే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఈ సినిమా టికెట్ ధరలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచనున్నాయని విన్నాము.

వాటిలో భాగంగా ఆల్రెడీ తెలంగాణ లో ప్రభుత్వం రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా మరి లేటెస్ట్ గా ఏపీ ప్రభుత్వం కూడా “ఆచార్య” సినిమాకి రేట్లు పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ సినిమా ని హీరోల రెమ్యునరేషన్స్ మినహా సూపర్ హై బడ్జెట్ క్యాటగిరీలో పది రోజులు పాటు 50 రూపాయల అదనపు ధరలు పెంచుకునే విధంగా కొత్త జీవోని రిలీజ్ చేసారు. దీనితో ఆచార్య సినిమాకి కూడా హైక్ దొరికినట్టు అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :