నందమూరి నటసింహం బాలయ్య నుంచి లేటెస్ట్ గా వచ్చిన దాదా ట్రీట్ తో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఖుషీగా ఉన్నారు. ఇక నేడు బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు కూడా నేడు కావడంతో వారికి నేడు మరింత స్పెషల్ గా మారింది. ఇక ఈ సమయంలో క్రేజీ కాంబినేషన్ ఇప్పుడు అనౌన్స్ అయ్యింది. నందమూరి హీరోతోనే సాలిడ్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు వశిష్ఠతో మోక్షజ్ఞ ఇప్పుడు ఓ బిగ్ ప్రాజెక్ట్ ని చేయనున్నాడు.
ఇక ఈ సినిమాని దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించనున్నట్టు ఓ పిక్ ని వీరి కాంబినేషన్ పై రివీల్ చేసి కన్ఫర్మ్ చేసారు. దీనితో ఈసారి వశిష్ఠ ఎలాంటి సినిమా అందిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ బింబిసార నందమూరి అభిమానుల్లో మంచి చోటు సంపాదించుకుంది. దీని సీక్వెల్ కోసం కూడా వారు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు.
