లేటెస్ట్..బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కు కరోనా పాజిటివ్.!

Published on Apr 4, 2021 10:54 am IST

ప్రస్తుతం కరోనా ప్రభావం మన దేశంలో మళ్ళీ ఏ స్థాయిలో పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. అలాగే అన్ని పరిశ్రమల్లో కూడా ఇది శరవేగంగా విస్తరిస్తుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలో మాత్రం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పాలి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

అలాగే ప్రసిద్ద క్రికెటర్ సచిన్ కి కూడా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఇదే బాలీవుడ్ నుంచి హైయెస్ట్ ఎర్నర్ అయినా స్టార్ హీరో అక్షయ్ కుమార్ తనకి పాజిటివ్ వచ్చినట్టుగా తెలిపారు. తాను ఈరోజు ఉదయం టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ తేలింది అని దీనితో వెంటనే తాను క్వారంటైన్ లోకి వెళ్లినట్టుగా తెలిపారు.

అలాగే ప్రస్తుతం కావాల్సిన మెడికల్ కేర్ తీసుకుంటున్నాని కాకపోతే ఈ మధ్యన తనని కలిసిన ప్రతీ ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించి త్వరలోనే తిరిగి వచ్చేస్తానని తెలిపారు. మరి ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని మనం కూడా ఆకాంక్షిద్దాం..

సంబంధిత సమాచారం :